Recent Posts

వందేళ్ల క్రితం దొగిలించబడిన అన్నపూర్ణ దేవి విగ్రహంను యు.పీ ప్రభుత్వంకు అందించిన కిషన్ రెడ్డి

అమరావతి: భారత సంస్కృతికి చెందిన విగ్రహాలు వివిధ దేశాల్లో ఉన్నాయని,వందేళ్ల క్రితం దొగిలించబడిన అన్నపూర్ణ దేవి విగ్రహం తిరిగి భారత్‌కు రప్పించేంద్ర ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్ని చర్యలు తీసుకుంటన్నరని టూరిజంశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.. 18వ శతాబ్దానికి చెందిన అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించారు..వదేళ్ల క్రితం చోరీకి గురైన ఈ విగ్రహాన్ని కెనడాలో గుర్తించామని,,కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి,అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని వెనక్కి తీసుకుని రావడం జరిగిందన్నారు.. మాత అన్నపూర్ణా దేవి యాత్ర పేరుతో 4 రోజులపాటు విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించి, ఈనెల 15న కాశీ విశ్వేశ్వర ఆలయంలో అన్నపూర్ణా దేవి విగ్రహ ఆవిష్కరణ యూపీ సీఎం యోగి చేతుల మీదుగా ఈ విగ్రహం పునఃప్రతిష్ట చేయనున్నట్లు తెలిపారు..కొద్ది రోజుల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్ ప్రభుత్వాలకు సైతం విదేశాల్లో ఉన్న విగ్రహాలు అందజేయనున్నట్టు తెలిపారు.. భారత సాంస్కృతికి చెందిన విగ్రహాలు వివిధ దేశాల్లో ఉన్నాయని,,సాధు, సంతుల దీవెనలతో, విదేశాల్లోని విగ్రహాలు, చిహ్నాలు, చిత్రపటాలు ప్రధాని నరేంద్ర మోడీ వెనక్కి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు.. విదేశాల్లోని విగ్రహాలు వెనక్కి తీసుకువచ్చిన ప్రధాని మోడీకి దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love
error: Content is protected !!