Recent Posts

పది పరీక్షలు నిర్వహించకుండా ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారు- ఏబీవీపీ

నెల్లూరు: రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో గత సంవత్సరం పదోతరగతి పరీక్షలు రద్దు చేశారని,,అదే విధంగా ఈ సంవత్సరం కూడా కరోనా నేపథ్యంలో పది పరీక్షలు జరుగుతాయి లేదా అనే అనుమానం విద్యార్థులలో నెలకొని వున్న తరుణంలో పది పరీక్షలు జరపకుండానే ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఏ విధంగా విడుదల చేస్తారని ABVP జిల్లా కన్వీనర్ రాజశేఖర్ ప్రశ్నించారు..సోమవారం నగరంలోని శివాజి భవన్ లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలకు అమ్ముడుపోయిందని ఆరోపించారు..కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల లబ్ధి కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవటం సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు..విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నరని,,ఈ నిర్ణయాన్ని ఎబివిపి స్వాగతిస్తుందని అయితే పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు..ఈ నోటిఫికేషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు..

Spread the love