Recent Posts

అమెరికాలో దీపావళీని సెలవు దినంగా ప్రకటించాలంటు ప్రతినిధుల సభలో బిల్లు

అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది జరుపుకుంటున్న భారతదేశ పండుగ అయిన దీపావళిని అమెరికాలోనూ జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ అమెరికా చట్టసభ సభ్యురాలు కెరోలిన్ బీ మహోనీ బుధవారం ప్రతినిధుల సభలో ఓ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు..కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సభలోని విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్‌పర్సన్ గ్రెగరీ మీక్స్‌తో కలిసి ఈ బిల్లును ప్రతిపాదించారు.ప్రపంచవ్యాప్తంగా హైందవ సంప్రదాయ బద్దంగా దీపావళిని జరుపుకుంటున్న అశేష ప్రజానీకానికి కెరోలిన్ శుభాకాంక్షలు తెలిపారు..ఈ బిల్లును ప్రతిపాదించడం తనకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు..భారత సంతతి వారు అమెరికా అభ్యున్నతికి చేసిన కృషికి ఈ బిల్లు ఓ గుర్తింపని తెలిపారు.అమెరికాలో భావితరాలు ఈ పండుగ జరుపుకునేలా బిల్లుకు చట్ట రూపం ఇవ్వాలంటూ అమెరికా కాంగ్రెస్, సెనెట్ సభ్యులను కోరారు..ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే..ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు, శాఖలు దీపావళి రోజును సెలవుగా ప్రకటించే అవకాశం ఉంటుంది.. 

Spread the love
error: Content is protected !!