Recent Posts

నరేంద్ర మోదీ రాజకీయ జీవితంపై పుస్తకంను ఆవిష్కరించిన హోంమంత్రి అమిత్ షా

అమరావతి: భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహర్నిశలు కృషిచేస్తున్నరని,,అయన నాయకత్వంలో దేశం శరవేగంతో వృద్ది పథంలో పయనిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు..ప్రధాని మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని,, ఆయనను ప్రజలు వారి గుండె లోతుల నుంచి ప్రేమిస్తున్నారని తెలిపారు..బుధవారం “నరేంద్ర మోడీ 20 ఏళ్ల రాజకీయ జీవితం” అనే పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న సందర్బంలో ఆయన మాట్లాడారు..ప్రధాని మోదీకి ఎటువంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకుండానే భారతదేశ ప్రధానమంత్రిగా ఎదగడం చాలా ముఖ్యమైన విషయమన్నారు..నరేంద్రమోదీ  నాయకత్వంలో బీజేపీ దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిందన్నారు..అలాగే బీజెపీపై అనేక ఆసత్య,ప్రతికూల ప్రచారాలు వచ్చినప్పటికి,,అభివృద్ది అనే నినాదంతో వాటిని పటాపంచల చేశారన్నారు..బీజేపీ అంటే హిందీ మాట్లాడేవారి పార్టీ అని,,కేవలం పట్టణ ప్రాంతాల్లోనే దీనికి పలుకుబడి ఉందని,, రైతుల పార్టీ కాదని,, విద్వేషపూరిత ప్రచారాలను నరేంద్ర మోదీ నాయకత్వంలో తిప్పికొట్టగలిగినట్లు పేర్కొన్నారు..మోదీ ప్రభుత్వం ప్రజలు ఇష్టపడటం కోసం కాకుండా,, సమాజంలో అన్ని వర్గాల వారికి శ్రేయస్సు కలిగించే నిర్ణయాలను ఎటువంటి రాజకీయ ఆలోచనలు లేకుండా తీసుకుంటుందని చెప్పారు..అద్భుతాలు, కుటుంబ నేపథ్యం, రాజకీయ ప్రాపకం వంటివేవీ లేకుండానే 2014లో మోదీకి అనుకూలంగా భారీ స్థాయిలో దేశ ప్రజల తీర్పు వచ్చిందన్నారు..2019లో మళ్లీ  ప్రధానిగా మోదీని సమర్ధనిస్తూ ప్రజాతీర్పు వచ్చిందన్నారు..మోదీని తము నమ్మిన నాయకునిగా ప్రజలు ఆమోదించారని దీనినిబట్టి స్పష్టమవుతోందన్నారు..ప్రధానిగా ప్రజల నమ్మకాన్ని మోదీ సాధించారని చెప్పారు..అటు పార్టీ కోసం, ఇటు ప్రభుత్వం కోసం సమాన స్థాయిలో గొప్ప అంకితభావంతో పని చేస్తున్న ఏకైక నేత నరేంద్రమోదీ అని చెప్పారు..ఆయన నాయకత్వంలో బీజేపీ ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా, అత్యధిక రాష్ట్రాల్లో పని చేస్తున్న పార్టీగా ఎదిగినట్లు తెలిపారు..

జయశంకర్:- విదేశాంగా శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, అసాధారణమైన దార్శనికత గల గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ అని కొనియాడారు.అయన ప్రతి ఆలోచనలోను దేశ ప్రయోజనాలే ఉంటాయన్నారు. గతంలో ఎవరూ అనుసరించని నూతన విదేశీ, ద్వైపాక్షిక విధానాలను అమలు చేస్తూ ముందుకు వెళ్లడం స్ఫూర్తి దాయకమన్నారు. మన భద్రతావసరాలకు చాలా ముఖ్యమైన సరిహద్దు మౌలికాభివృద్ధిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి ని సారించడం చాలా గొప్ప విషయమని డాక్టర్ జయశంకర్ అన్నారు..ఈకార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు..

(MODI 20 @  DREAMS MEET DELIVERY పుస్తకాన్ని బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సంకలనం చేసింది.)..

Spread the love
error: Content is protected !!