Recent Posts

బంగ్లాదేశ్‌లో హిందు గ్రామాలు తగలపడిపోతున్నాయి-తస్లీమా

అమరావతి: బంగ్లాదేశ్‌లో మైనార్టీలు అయిన హిందువులపై దాడులు పెరిగిపోయాయని,,హిందూ గ్రామాలు తగలబడుతున్నాయని రచయిత తస్లీమా నస్రీమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మంటల్లో బూడిదవుతున్న గ్రామానికి సంబంధించిన ఒక ఫొటోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తు,బంగ్లాలో ఇంతటి సంక్షోభం కొనసాగుతోంటే ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా ఫ్లూట్ వాయిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.బంగ్లాదేశ్‌లోని పిర్గంజ్,,రంగాపూర్ జిల్లాల్లో ఉన్న రెండు హిందూ గ్రామాలు రాత్రి తగలపడిపోయాయని ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్‌లో దుర్గా మండపాలపై దాడితో ఈ తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని,,మైనారిటీ మతస్తులైన హిందువులపై అక్కడి మెజారిటీ మతస్తులైన ముస్లింలు చేస్తున్న దాడులకు నిరసనగా మైనారిటీ వర్గాల ప్రజలు ఆదివారం దేశ వ్యాప్తంగా నిరాహార దీక్ష చేపట్టారన్నారు..

Spread the love
error: Content is protected !!