Recent Posts

పేదల ఇళ్లపై కోర్టు తీర్పు బాధకరం-మంత్రి బొత్స

అమరావతి: పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బాధ కలిగించిందని  మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.శనివారం విజయనగరంలో ఆసరా పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంలో అయన మాట్లాడుతూ దీనిపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని  తెలిపారు.కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన విధానల ఆధారంగానే పేదలకు ఇళ్ల పథకం తీసుకుని వచ్చమని, ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టంగా వివరిస్తామన్నారు. టీడీపీ నేతలు సాంకేతిక అంశాల పేరుతో వారికి వున్న పరిచయాలు వాడుకుని సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ఒడిదుడుగులు ఎదురైనా ఇచ్చినా హామీలను నెరవేరుస్తామని బొత్స అన్నారు..గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పడు అధిక టారిఫ్‌లకు విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్లే విద్యుత్‌ పంపిణీ సంస్థలు నష్టాల్లో కూరుకున్నాయన్నారు.. చంద్రబాబు ప్రభుత్వం రూ.వేల కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టిందని, ఆ బకాయిలన్నింటినీ మా ప్రభుత్వం చెల్లిస్తోందని మంత్రి పేర్కొన్నారు..

Spread the love