Recent Posts

ఇంటర్మీడియట్ Online అడ్మిషన్ల ప్రక్రియను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ Online అడ్మిషన్ల ప్రక్రియను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.సరైన నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించకుండా Online అడ్మిషన్లకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిందంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయ.సెంట్రల్ ఆంధ్ర జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డితోపాటు పలువురు విద్యార్థులు కూడా దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది.సరైన నియమ నిబంధనలు, విధానాలు రూపొందించకుండా నోటిఫికేషన్ జారీ చేశారన్నవాదలనకు హైకోర్టు అంగీకరిస్తూ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.అంతేకాదు గతంలో మాదిరిగానే అడ్మిషన్లు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది.. 

Spread the love