Recent Posts

ఢిల్లీ విమానశ్రాయంలో రూ.28 కోట్లు విలువ చేసే హెరాయిన్ సీజ్

అమరావతి: మాదక ద్రవ్యాలను ఏదొ ఒక రూపంలో దేశంలోకి రవాణ చేసేందుకు స్మగ్లర్స్ ప్రయత్నిస్తునే వుంటారు..ఇటీవల కేరళ రాష్ట్రంలో సముద్ర మార్గంలో దాదాపు రూ.30 కోట్ల రూపాయలు విలువచేసే హెరాయిన్ రవాణ చేస్తుండగా,కోస్టుగార్డ్స్ స్మగ్లర్స్ ను అరెస్ట్ చేసి డ్రగ్స్ ను సీజ్ చేశారు..దింతో స్మగ్లర్స్,, డ్ర‌గ్స్ ను ర‌వాణా చేసేందుకు ఇప్పుడు ఏకంగా విమానాల‌ను ఉప‌యోగిస్తున్నారు..సోమవారం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో సారి భారీగా డ్రగ్స్ ప‌ట్టుపడ్డాయి..సౌత్ ఆఫ్రికా,డర్బన్ నుండి ఢిల్లీ వచ్చిన టాంజానియా దేశస్తుడి నుంచి 28 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను క‌స్ట‌మ్స్ అధికారులు గుర్తించారు..స్మగ్లర్ హెరాయిన్ పౌడర్ ను హాండ్ బ్యాగ్, ట్రాలీ బ్యాగ్ లో ప్రత్యేకంగా రంద్రాలు చేసి అందులో నింపాడు..ఢిల్లీ విమనాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు ప్రయాణికుడిపై అనుమానం వచ్చి అతని ల‌గేజ్ బ్యాగ్‌ను క్షుణంగా త‌నిఖీ చేయగా, సుమారు 4 కేజీల గోధుమ రంగంలో వున్న హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్క‌నారు.. ప్ర‌యాణికుడిని అరెస్ట్ చేసి,విచార‌ణ చేప‌ట్టారు..

Spread the love