Recent Posts

తమిళనాడుకు మరో 4 రోజులు పాటు భారీ వర్షాలు

అమరావతి: తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలతో అతలకుతలం అవుతుంది..తాజాగా భారత వాతావరణశాఖ  హెచ్చరికలు జారీ చేస్తు,,మరో 4 రోజుల పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది..బుధవారం నుంచి భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. కన్యాకుమారి, రామనాథపురం, తిరునల్వేలి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు..అలాగే గురు,శుక్రవారల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని,ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.పుదుచ్చేరి, కరైకల్ తోపాటు పలు జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ప్రజా ప్రతినిధులు అధికారులకు అవసరమైన సహాయక చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే కోరారు. స్వయంగా వర్షాలు, వరద బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ సహాయక చర్యలను తనిఖీలు చేస్తున్నారు..

Spread the love
error: Content is protected !!