Recent Posts

తిరుమలలో భారీ వర్షం-ఆహ్లాదకరంగా మారిన వాతవరణం

తిరుపతి: తిరుమలలో అల్పపీడన ప్రభావంతో బుధవారం మధ్యహ్నం నుంచి దాదపు 3 గంటల పాటు కుండపోత వర్షం కురిసింది.పౌర్ణమి కావడంతో కలియుగ వైకుంఠానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో చేరుకున్నారు.మధ్యహ్నం వరకు ఉక్కపోతగా వున్న వాతవరణం,వర్షంతో ఒక్క సారిగా చల్లగా మారి ఆహ్లాదకరంగా మారింది..భారీవర్షాల పుణ్యమాని తిరుమలలో వాగులు వంకలు పరవళ్ళు తొక్కుతున్నాయి.గతంలో ఇలాంటి వర్షం కురవలేదంటున్నారు భక్తులు.ఈశాన్య రుతుపవనాల సమయంలో తిరుమలలో రికార్డు స్థాయి వర్షం కురిసింది.రాయలసీమలో అత్యధిక వర్షపాతం తిరుపతిలోనే నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఊహించిన సగటు వర్ష పాతం కంటే ఎక్కువగానే వర్షం కురవడం వల్ల తిరుమలకు నీటి కొరత తీరిపోయింది.భక్తుల సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతోంది.దీంతో టీటీడీ అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.గ‌రుడ వాహ‌నంపై మాడ‌వీధుల్లో శ్రీవారు విహ‌రించారు.

Spread the love
error: Content is protected !!