AMARAVATHIPOLITICS

కడప జిల్లాలో ఇష్టానుసారంగా గన్ లైసెన్సులు ఇచ్చారు-రాంగోపాల్ రెడ్డి

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పలు YSRCP కార్యాలయాలను నిబంధనలు లెక్క చేయకుండా పార్టీ ఆఫీసులను ఇంద్ర భవనాల్లాగా కట్టారని,, అనుమతులు లేకపోవడంతోనే అధికారులు వాటిని కూల్చివేస్తున్నట్లు MLC భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి చెప్పారు..మంగళవారం పులివెందుల R&B హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాడేపల్లిలోని YCP పార్టీ కేంద్ర కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ అధికారులు అనేకసార్లు నోటీసులు ఇచ్చిన విషయాన్ని MLC గుర్తు చేశారు..వైసీపీ ప్రభుత్వం హయంలో కడప జిల్లాలో ఇష్టానుసారంగా గన్ లైసెన్సులు ఇచ్చారని,, ఇది దేనికి సంకేతం అంటూ ప్రశ్నించారు.. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ(PADA)లో అవినీతికి హద్దు లేకుండా పోయిందని విషయంను నియోజకవర్గ ప్రజలు గుర్తించాలన్నారు..నిజంగా ప్రజలకు ఉపయోగపడేలా వేల కోట్ల రూపాయల నిధులు వినియోగిస్తే ఎందుకు దాచి పెడుతున్నారని నిలదీశారు..5 సంవత్సరాల వైసీపీ పాలనలో PADA సంస్థలో ఆడిట్ జరగలేదని చెప్పారు..2029 ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ జెండా ఎగరవేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *