Recent Posts

ఆనందయ్య మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్-చుక్కల మందు తప్ప

నెల్లూరు: నెల్లూరుజిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య పంపిణీ చేసిన మందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.. ఆనందయ్య మందు వాడితే హాని లేదని CCRAS ఇచ్చిన నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది.. ఆనందయ్య ఇచ్చే P,,L,,F,,మందులకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది..అయితే కంట్లో వేసే చుక్కల మందు “K” విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉందని,, దీనిపై స్పష్టత రావడానికి మరో 2 నుంచి 3 వారాల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది..ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని కరోనా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది..డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ ఎవరికి ఇష్టమైతే వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని సూచించింది..ఆనందయ్య మందును తీసుకోవడానికి కోవిడ్‌ పాజిటివ్‌ రోగులు రాకుండా ఉండాలని,,వారికి బదులు వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్లవచ్చని తెలిపింది..దిని వల్ల కరోనా వైరస్ విస్తరించే ప్రమాదం తప్పుతుందని చెప్పింది.. ఆనందయ్య మందు పంపిణీ సందర్భంలో కోవిడ్‌ ప్రోటో కాల్‌ పాటించాలని ప్రభుత్వం సూచించింది..

Spread the love