Recent Posts

వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజం- జనసైనికుల సింహ గర్జనలు సహజమే-పవన్

విస్తృతస్థాయి సమావేశంలో..

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులు,ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ  నాయకులకు డబ్బు, అధికారం, అహంకారం అన్ని ఉన్నాయయని,ఒక్క భయం తప్ప, ఖచ్చితంగా భయం అంటే ఏంటో చూపిస్తానని హెచ్చరించారు..బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.నేను పద్దతిగా సంస్కారవంతంగా ఉంటే వైసీపీ వారికి నచ్చట్లేదని,బూతులు మాట్లాడాలి అనుకుంటే నేను మీకంటే బాగా మాట్లాడతాను,,నాకు బూతులు రాక కాదు, బాపట్లలో పుట్టినోడిని నాకు తిట్లు రావా? అని అన్నారు.నేను నాలుగు భాషల్లో బూతులు తిట్టగలను,నాలుగు రోజులు సమయమిస్తే నేర్చుకుని మరీ, ఏ భాషలో కావాలంటే ఆ భాషలో తిడతానన్నారు. వైసీపీ అధినేత కూడా నా వ్యక్తిగతం గురించి మాట్లాడారని,నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పించారన్నారు. వైసీపీ నేతల ఇంట్లో ఆడవారిపై తప్పుగా మాట్లాడబోమని హామీ ఇస్తున్నారు. తాను ఒకటి మాట్లాడితే, వైసీపీ వాళ్లు మరొకటి మాట్లాడుతున్నారని అన్నారు. జగన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేసారమ్మా అంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ  గ్రామ సింహాల గొంకారాలు సహజం, జనసైనికుల సింహ గర్జనలు సహజం అన్నారు.కులాల చాటున దాక్కుంటే,బయటకు లాక్కొచ్చి కొడతానని,,కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదన్నారు..నేను ఎప్పుడు ఏది అడిగినా ఏపీ గురించే అడుగుతా.. టీడీపీకైనా బీజేపీకైనా ఏపీ కోసమే మద్దతు ఇచ్చా. కాట్ల కుక్కల్లా అరుస్తారేంటి.. మాట్లాడటం రాదా మీకు ?. ఓ పని చేయండి.. ఇళ్లలోకి వచ్చి బంగారం కూడా లాగేసుకోండి..నేను అడుగుతున్నది ఒకరి కష్టార్జితాన్ని మీరెవరు దోచుకోవడానికి అని అడిగా.. నేను సినిమా టికెట్ల గురించి అడిగా నాకేమైనా థియేటర్లు ఉన్నాయా? వైసీపీ వారికే ఉన్నాయి.. మహానుభావులకు అయితే తల వంచుతాం.. మీలాంటి వారి తాట తీస్తాం..ఏదైనా అంటే అరుస్తారు…మాట్లాడరు. ఏపీలో అభివృద్ధి లేదు..ఒక్క రోడ్డయినా వేశారా అంటూ పవన్ ప్రశ్నించారు..

Spread the love