Recent Posts

దాడులు చేస్తుంటే వారితో కూర్చుని చర్చలు జరిపే రోజులు గతం- సర్జికల్ స్ట్రైక్స్ తో సమాధనం-అమిత్

పాకిస్థాన్ కు హెచ్చరిక..

అమరావతి: దేశంలోకి చొరబడి దాడులు చేస్తుంటే వారితో కూర్చుని చర్చలు జరిపే రోజులు గతంలో ఉండేవని,ప్రస్తుతం ఉగ్రవాద దాడులకు దీటైన జవాబు చెప్పే రోజులని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాకిస్థాన్‌ను హెచ్చరించారు..గోవాలోని ధర్బండోరాలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి గురువారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,,అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడం చాలా ముఖ్యమైన విషయమని అమిత్ షా చెప్పారు. భారత దేశ సరిహద్దుల వద్ద ఎవరూ ఇబ్బందులు కల్పించలేరనే సందేశాన్ని పంపించామన్నారు. గతంలో చర్చలు మాత్రమే జరిపేవారమని, కానీ ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో దాడులు జరిపిన వారికి ‘తిరిగి ఇచ్చే’ సమయం వచ్చిందన్నారు..గోవాకు చెందిన మనోహర్ పారికర్ ఎంతో ముందు చూపుతో నిర్ణయాలు తీసుకునేవారని,ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు..పూంఛ్‌లో ఉగ్రవాదులు దాడి చేసినపుడు,భారత దేశం సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో ధీటుగా సమాధానం చెప్పిందన్నారు..గతంలో లాగా పాతచింతకాయ పచ్చడి మాటలు లేవని,ప్రస్తుతం నూతన యువత ఆలోచనలతో,ఉగ్రవాదులకు వారి భాషలోనే తాము సమాధానం చెబుతామనే సందేశాన్ని భారత దేశం పంపించిందని చెప్పారు.గత కొన్ని రోజుల నుంచి జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాదులు హిందువులు, సిక్కులను గుర్తించి మరీ చంపుతున్నారు.ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌ను,టీచర్‌ను ఉగ్రవాదులు వారి ఐడెంటిటీ కార్డులు తనిఖీ చేసి మరీ చంపారని ఆ టీచర్ చెప్పారు.ఈ నేపథ్యంలో అమిత్ షా మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో సమాధానం చెబుతామని పాకిస్థాన్‌ను హెచ్చరించారు..

Spread the love
error: Content is protected !!