Recent Posts

కర్నూలు గ్రామీణ బ్యాంకులో బంగారు అభరణాలు మాయం

కర్నూలు: బంగారు ఆభరణాలను అవసరాల కోసం కొంత మంది,,జాగ్రత్త కోసం ఇంకొంత మంది బ్యాంకు లాకర్లలో దాచుకుంటారు..అలా దాచుకున్న బంగారు అభరణాలు కన్పించకపోవడంతో,ఖాతాదారులు లబోదిబోమంటున్నారు..విషయంలోకి వస్తే,, కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు స్థానిక ప్రాంతంలోని ప్రజలు,,రైతులు,, వ్యాపారులకు అన్ని రకాల సేవలు అందిస్తోంది..మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోల్చితే, ఏపీ గ్రామీణ బ్యాంకుల పనితీరు బాగా వుండడంతో పాటు ఉద్యోగులు కూడా బ్యాంకు కస్టమర్లతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తు వుండడం ఈ బ్యాంకుకు బాగా కలసి వచ్చింది..గ్రామీణ బ్యాంకుపై నమ్మకం ఉండడం వల్లే కాబోలు ఉయ్యాలవాడ లాంటి మారుమూల ప్రాంతంలో ఉన్నబ్యాంకులో లావాదేవీలు,,రుణాలు భారీగా ఉంటున్నాయి..శనివారం ఉదయం ఓ మహిళ బ్యాంకు లోన్ రెన్యువల్ చేసుకునేందుకు వెళ్లగా,,మీరు తాకట్టుపెట్టిన బంగారు ఆభరణాలు బ్యాంకులో కనిపించడం లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో షాకు గురైయింది..వెంటనే బ్యాంకు మేనేజర్ మధుసూధన్ తానే స్వయంగా ఒకటికి నాలుగుసార్లు బ్యాంకు లాకర్ గాలించినా ఆభరణాలు కనిపించకపోవడంతో రీజనల్ మేనేజర్ కు సమాచారం ఇచ్చి ఖాతాదారులను బ్యాంకులోనే కూర్చోబెట్టారు.. అమె,,తనతోపాటు తాకట్టు పెట్టిన మరికొందరికి సమాచారం ఇవ్వడంతో వారు కూడా వచ్చి తాము కుదవపెట్టిన ఆభరణాల రశీదులు చూపించి తనిఖీ చేయమని కోరారు..ఇలా ఒకరితర్వాత ఒకరు బ్యాంకు కు చేరుకుని,,వారందరు కూడా తనిఖీలు చేయమని కోరారు..రీజనల్ మేనేజర్ హుటాహుటిన బ్యాంకుకు తరలివచ్చి స్వయంగా తనిఖీలు చేయగా,,మొత్తం 17 మంది ఖాతాదారులకు చెందిన 1300 గ్రాముల బంగారు ఆభరణాలు మాయం అయినట్లు గుర్తించారు..మేనేజర్ తో కలసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆళ్లగడ్డ డీఎస్పీ ఎ.రాజేంద్ర స్వయంగా బ్యాంకుకు వచ్చి వివరాలు ఆరా తీశారు..గతంలో పనిచేసి వెళ్లిన వారిపై అనుమానాలు రావడంతో ఇంటిదొంగలెవరో తేల్చేందుకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.. 

Spread the love