Recent Posts

ఘనంగా భోళా శంకర్ సినిమా పూజా కార్యక్రమాలు

హైదరాబాద్: డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్న భోళా శంకర్ సినిమా పూజా కార్యక్రమాలను గురువారం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభించారు..తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ గా ఈ సినిమా రూపొందిస్తున్నారు..అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమా అన్నా చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందించారు.చిరంజీవి కెరీర్‏లో 155వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‏గా నటించనుండగా,,చిరు చెల్లెలిగా కీర్తిసురేష్ నటిస్తుంది..ఈనెల 15వ తేది నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.భోళా శంకర్ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేయాలనీ మెగాస్టార్ కండీషన్ పెట్టినట్లు సమాచారం. సినిమా చిత్రీకరణ కు ఎక్కువ సమయం తీసుకోకుండా మొత్తం 40 నుంచి 50 వర్కింగ్ డేస్ లోనే ముగించేలా ప్లాన్ చేయాలని మెహర్ రమేష్ సూచించినట్లు ఫిల్మినగర్ సమాచారం..

Spread the love
error: Content is protected !!