Recent Posts

టారిఫ్ లను పెంచిన జియో మొబైల్ నెట్ వర్క్

అమరావతి: ఇండియా లీడింగ్ మొబైల్ ఆపరేటర్ అయిన జియో 21 శాతం మేర ఛార్జీలను పెంచుతున్నట్టు ఆదివారం ప్రకటించింది.పెంచిన చార్జీలు డిసెంబర్‌ 1వ తేది నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.ఇటీవల ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఇండియా ఛార్జీలు పెంచిన సంగతి విదితమే..టెలికాం పరిశ్రమను బలోపేతం చేయడానికే ఛార్జీలను పెంచుతున్నట్టు జియో ఓ ప్రకటనలో తెలిపింది..ఈ మేరకు సవరించిన అన్ని ఫ్లాన్‌ల ధరల వివరాలను వెల్లడించింది. జియో ఫోన్‌ కోసం అందుబాటులో ఉన్న ప్రాథమిక ప్లాన్‌కు రూ.75 బదులు ఇకనుంచి రూ.91 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ. 199 ప్లాన్‌ (28 రోజులకు 1.5జీబీ/రోజుకు) ధరను రూ.239కి పెంచింది. రూ.444 ప్లాన్‌కు రూ.533, రూ.555 ప్లాన్‌కు రూ.666 చొప్పున ఇక పైనుంచి చెల్లించాల్సి ఉంటుంది.

Spread the love
error: Content is protected !!