Recent Posts

వినాయక చవితి నాడు మార్కెట్ లోకి జియో స్మార్ట్ ఫోన్ విడుదల-ముకేష్ అంబానీ

అమరావతి: రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) 44వ వార్షిక సర్వసభ్య సమావేశం గురువారం ప్రారంభమైంది..ఈ సందర్బంలో చైర్మన్ ముకేశ్ అంబానీ వర్చవల్‌గా  ప్రసంగించారు..ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేస్తు,గూగుల్‌తో కలిసి జియో ట్రూలీ బ్రేక్ థ్రూ స్మార్ట్‌ ఫోన్ జియో ఫోన్ నెక్స్ట్ ను అభివృద్ధి చేసినట్టు చెప్పడానికి సంతోషిస్తున్నని అన్నారు..ఇది పూర్తిగా ఫీచర్డ్ స్మార్ట్‌ ఫోన్ అనీ,,గూగుల్, జియో అప్లికేషన్లు అన్నీ ఈ ఫోన్‌లో ఉంటాయని చెప్పారు. ఇది ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేస్తుందన్నారు. సెప్టెంబరు 10వ తేదిన వినాయక చవితిని పురస్కరించుకుని మార్కెట్లో విడుదల చేయనున్నట్టు అంబానీ పేర్కొన్నారు..రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా సౌదీ అరాం కో చైర్మన్, పీఐఎఫ్ గవర్నర్ యాసిర్ అల్-రుమయ్యాన్ చేరబోతున్నట్టు ప్రకటించారు..బోర్డులో ఆయన చేరిక రియలన్స్ అంతర్జాతీయంగా ప్రామాణలను అందుకునేందుకు ఇది ప్రారంభమని పేర్కొన్నారు..కరోనా మహమ్మారి సమయంలోనూ అరాంకో, రిలయన్స్ మధ్య బలమైన బంధం ఏర్పడిందని,, ఏడాది తమ భాగస్వామ్యం మరింత వేగవంతమువుతందని ఆశిస్తున్నట్టు చెప్పారు..గత సంవత్సర కాలంగా భారత్‌లో జియో ఫైబర్ 2 మిలియన్లకు పైగా కొత్త కార్యాలయలను కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు..జియోఫైబర్‌కు 3 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నట్టు చెప్పారు..జియో ఫైబర్ దేశంలోనే అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిక్స్‌ డ్ బ్రాడ్‌బ్యాండ్ ఆపరేటర్‌గా రికార్డులకెక్కిందన్నారు..

Spread the love