Recent Posts

గూగుల్ ఓఎస్‌కు ఆండ్రాయిడ్‌ 12కు “ప్రగతి ఓఎస్‌”గా పేరును ఖరారు చేసిన జియో

అమరావతి: జియో ఫోన్‌ నెక్ట్స్‌ కోసం దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ ఫోన్‌పై ఫిచర్స్ మరో అప్‌ డేట్‌ వచ్చింది.జియో ఫోన్‌లో భారతీయత ఉట్టిపడేలా ‘ఆపరేటింగ్‌ సిస్టం’కు ట్రెడిషనల్‌ పేరు పెట్టి జియో అధినేత ముఖేష్‌ అంబానీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ సందర్భంగా ఫోన్‌లో ఫీచర్లు, ఓఎస్‌ గురించి జియో అధికారికంగా ప్రకటించింది..గూగుల్‌ సంస్థ అక్టోబర్‌ 4వ తేదిన సరికొత్త ఓఎస్‌ ఆండ్రాయిడ్‌ 12 రిలీజ్‌ చేసింది..దివాళీకి విడుదల కానున్న జియోలో ఈ లేటెస్ట్‌ వెర్షన్‌ అందుబాటులోకి రానుంది..గూగుల్ ఇప్పటి  వరకు విడుదల చేసిన అన్ని ఆండ్రాయిడ్‌  వెర్షన్‌లకు 31 రకాల పేర‍్లు ఉన్నాయి..ఉదహరణకు స్నో కోన్‌,,రెడ్ వెల్వెట్ కేక్,,క్విన్స్ టార్ట్,, ఓట్‌ మీల్‌ కుకీ ఇలా వెస్ట్రన్‌ పేర్లున్నాయి..కోట్ల మంది యూజర్లు వున్న మనదేశ సాంప్రదాయానికి అనుగుణంగా ఏ ఒక్క ఆండ్రాయి వెర్షన్‌లకు పేర్లు పెట్టలేదు..తొలిసారి జియో ఫోన్‌ నెక్ట్స్‌ లో తొలిసారి గూగుల్ ఓఎస్‌కు ‘ప్రగతి ఓఎస్‌’గా నామకరణం చేశారు..జియో​ ఫోన్‌ను అందరూ వినియోగించి,ప్రగతి (ప్రొగ్రెస్‌) సాధించాలని ఉద్దేశంతో ప్రగతి పేరు పెట్టినట్లు జియో తెలిపింది..ఈ ఫోన్‌ కనెక్టివిటీ సమస్య లేకుండా ఉండేందుకు క్వాల్కమ్‌ ప్రాసెసర్‌, వాయిస్‌ అసిస్టెంట్స్‌, టాన్స్‌ లేట్‌, ఈజీ అండ్‌ స్మార్ట్‌ కెమెరా, ఆటోమెటిక్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌, జియో – గూగుల్‌ యాప్స్‌ ప్రీలోడెడ్‌ ఫీచర్లు ఉన్నాయి..దీపావళికి విడుల జియో ఫోన్ ప్రపంచంలో అత్యంత చవకైన  ఫోన్‌ గా వినియోగదారుల అదరణ పొందుతుందా అనేది వేచిచూడాలి..?

Spread the love
error: Content is protected !!