Recent Posts

గ్యాంగ్‌స్టర్ కాలా జతేదీ,రాజస్థాన్ డాన్ అనురాధ చౌదరీలు అరెస్ట్

అమరావతి: గ్యాంగ్‌స్టర్ కాలా జతేదీ,అతడి పార్టనర్ & రాజస్థాన్ డాన్ అనురాధ చౌదరిని షహరాన్‌పూర్‌లో ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఢిల్లీ పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్ అయిన కాలాజతేదీ గ్యాంగ్,ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను చంపేస్తానని బెదిరించిన కేసులో అదుపులోకి తీసుకున్నట్టు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నిర్ధారించింది.గ్యాంగ్‌స్టర్ కాలాజతేదీ తలపై రూ.7 లక్షల రూపాయల రివార్డు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.సోనీపట్‌కు చెందిన జతేదీ పైఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌ల్లో పలు కేసులు నమోదైయ్యాయి. రెజర్లర్ సాగర్ రాణా హత్య కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉంటున్నసుశీల్ కుమార్,కాలా జతేదీ మేనల్లుడు అయిన సోను మహల్‌ను కూడా చావగొట్టాడు..విషయం తెలిసిన కాలాజతేదీ, చంపేస్తానంటూ సుశీల్ కుమార్‌ను హెచ్చరించాడు. జతేదిపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్‌గ్ క్రైమ్ యాక్ట్ (MCCCOA)ను కూడా ఢిల్లీ పోలీసులు ప్రయోగించారు.గత పది నెలల్లో కాలా జతేదీ గ్యాంగ్ ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్‌లలో 25 హత్యలకు పాల్పడింది.

Spread the love