Recent Posts

భారత్‌‌లో ప్రొడక్షన్ మొదలుపెట్టండి లేదంటే మరోకరికి అవకాశం,టెస్లాకు మంత్రి గడ్కరీ సూచన

అమరావతి:  అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా భారత్‌‌ మార్కెట్ లో కాలుమోపేందుకు సన్నాహాలు చేస్తోంది..టెస్లా ప్లాంట్ కు కావాల్సిన సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు..దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాట్లు చేసుకునేందుకు టెస్లాకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.. రైజినా డైలాగ్ 2021లో పాల్గొన్న గడ్కరీ సందర్బంలో టెస్లాతోపాటు వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ,, ఎలక్ట్రిక్ మొబిలిటీ,,ఈవీ బ్యాటరీల్లో భారత్ పుంజుకుంటున్న తీరు లాంటి అంశాల గురించి మాట్లాడారు.. ‘టెస్లా మేనేజ్‌మెంట్‌తో నేను వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడాను,,భారత్‌‌లో మానుఫ్యాక్చరింగ్‌‌ను మొదలుపెట్టడానికి ఇది సువర్ణావకాశం అని,,ఎందుకంటే ఆ కంపెనీ ఇప్పటికే భారతదేశం నుంచి పలు విడి భాగాలను దిగుమతి చేసుకుంటోంది’ అని పేర్కొన్నారు.. టెస్లా మానుఫ్యాక్చరింగ్‌‌ను ప్రారంభించకపోతే ఆ కంపెనీ స్టాండర్ట్స్‌ ‌తో ఎలక్ట్రిక్ కార్లను రూపొందించే మిగిలిన సంస్థలకు అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు..

Spread the love