Recent Posts

నేటి నుంచి బీహర్ లో పూర్తి స్థాయి కర్ఫ్యూ-సీ.ఎం.నితీష్

అమరావతి: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నప్పటికి గత మూడు రోజులుగా పాజిటివ్ కేసులు మహారాష్ట్ర,, ఢిల్లీ,,గుజరాత్‌లో తగ్గుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది..మహారాష్ట్రలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడానికి పూర్తి స్థాయి కర్ఫ్యూ విధించడం కూడా కలసి వచ్చింది.. కోవిడ్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని,,పూర్తి అధికారాలను రాష్ట్రాలకే కేంద్రం అప్పగించింది..దింతో పలు రాష్ట్రాలు పూర్తి స్థాయి కర్ఫ్యూ దిశగా సాగుతున్నాయి..ఇప్పటికే ఢిల్లీ,,ఒడిశా,,మహారాష్ట్ర,,తమిళనాడు,,కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కర్ఫ్యూకొనసాగుతోంది.. ప్రస్తుతం ఈ జాబితాలో బిహార్ చేరింది..మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి మే 15వ తేది ఉదయం 7 గంటల వరకు పూర్తి స్థాయి కర్ఫ్యూ విధిస్తున్నట్టు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటిస్తు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు..రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై క్యాబినెట్ మంత్రులు, అధికారులతో సోమవారం చర్చించడం జరిగిందని,,ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో వుంచుకుని పూర్తి స్థాయి కర్ఫ్యూఅమలుచేయాలని నిర్ణయించినట్టు నితీశ్ తెలిపారు.. కర్ఫ్యూకు సంబంధించిన విధి విధానాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Spread the love