Recent Posts

ఇక నుంచి తిరుమలలో భక్తులు గదులను సులభంగా పొందవచ్చు

తిరుపతి: శ్రీవారీ దర్శనం కోసం వెళ్లె భక్తులు తిరుమలలో గదుల కోసం పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో వసతి గదుల కోసం గ‌దుల కొర‌కు పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకునే అవ‌కాశాన్ని టిటిడి క‌ల్పిస్తోంది..ఈనెల 12వ తేదీ(శనివారం) నుంచి ఉద‌యం 8 గంట‌ల నుండి తిరుమ‌ల‌లోని ఆరు ప్రాంతాల్లో నూత‌నంగా టిటిడి ఏర్పాటు చేసిన కౌంట‌ర్ల‌లో వ‌స‌తి బుకింగ్ విధానం ప్రారంభం అవుతుంది..గదుల బుకింగ్ కౌంటర్స్:- GNC టోల్‌గేట్ వ‌ద్ద ఉన్న ల‌గేజి కౌంట‌ర్ వద్ద  రెండు కౌంట‌ర్లు,,బాలాజి మెయిన్ బ‌స్టాండ్ వ‌ద్ద రెండు కౌంట‌ర్లు,,కౌస్తుభం అతిథి భ‌వ‌నం వ‌ద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో రెండు కౌంట‌ర్లు,,రాంభ‌గిచ బ‌స్టాండ్ వ‌ద్ద రెండు కౌంట‌ర్లు,,MBC ప్రాంతంలోని శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద రెండు కౌంట‌ర్లు,,CRO వ‌ద్ద రెండు కౌంట‌ర్ల వద్ద భ‌క్తులు వ‌స‌తి కోసం గది కావాలంటే పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకోవచ్చు…భ‌క్తుల‌కు SMS ద్వారా వారికి కేటాయించిన గ‌దుల స‌మాచారం తెలియ‌జేయ‌బ‌డుతుంది..అనంత‌రం వారికి గ‌దులు కేటాయించిన ప్రాంతాల్లోని ఉప విచార‌ణ కార్యాల‌యాల వ‌ద్ద నగదు చెల్లించి గ‌దులు పొంద‌వ‌చ్చు..ఈ అవ‌కాశాన్ని భ‌క్తులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని TTD భక్తులకు విజ్ఞప్తి చేసింది.. 

Spread the love