Recent Posts

ఇక నుంచి అమెజాన్ ప్రైమ్​ యూజర్లకు 3 లేదా 12 నెలల సబ్​స్క్రిప్షన్ ప్లాన్లు​ మాత్రమే

అమరావతి: ఓటీటీ ప్లాట్​ఫామ్ పై వినియోగదారులకు పలు సేవాలను అందిస్తున్న​ అమెజాన్ ప్రైమ్​ యూజర్లకు నెలవారీ సబ్​స్క్రిప్షన్​ ప్యాక్​ను తాత్కాలికంగా నిలపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసంది..అలాగే తన కొత్త యూజర్లకు కోసం ఇచ్చే ఫ్రీ ట్రయల్​ ఆఫర్​ను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు స్పష్టం చేసింది..దీంతో, ప్రైమ్​ యూజర్లకు ఇకపై కేవలం 3 నెలలు లేదా 12 నెలల వ్యవధి గల ప్రైమ్ సబ్​స్క్రిప్షన్ ప్లాన్లు​ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి..RBI నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్​ వెల్లడించింది..రీఛార్జులు,,ఓటీటీ,, డీటీహెచ్​ వంటి రికరింగ్​ ఆన్​లైన్​ లావాదేవీల కోసం అడిషనల్​ ఫ్యాక్టర్​ ఆఫ్​ అథెంటికేషన్​ (AFA)ను అమలు చేయాలని బ్యాంకులను,, ఫైనాన్స్​ సంస్థలను RBI ఆదేశించించిన విషయం విదితమే..దింతో AFA నిబంధనలకు లోబడి నెలవారీ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​ రూ. 129ని తొలగించినట్లు అమెజాన్​ పేర్కొంది..ఇక నుంచి ప్రైమ్​ సబ్​స్క్రిప్షన్​ తీసుకోవాలి అనుకునే వారికి రూ.329 విలువ చేసే మూడు నెలల ప్లాన్​,,లేదా రూ.999 విలువ గల సంవత్సరం ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి..ఎవరైనా యూజర్​ కొత్త ప్రైమ్​ మెంబర్​షిప్​ తీసుకోవాలన్నా,, లేదంటే పాత యూజర్ ను రెన్యువల్​ చేసుకోవాలన్నా 3 నెలలు లేదంటే 12 నెలల సబ్​స్క్రిప్షన్​ను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది..ఏప్రిల్​ 27వ తేదిన అమెజాన్ ప్రైమ్ తన సపోర్ట్​ పేజీలో మార్పులు చేశారు..ఈ నిర్ణయాన్ని మార్చి 31వ తేది నుంచే అమలు చేయాలని RBI నిర్దేశించింది..అయితే బ్యాంకులు,,పేమెంట్ గేట్​వేల వినతితో దీన్ని సెప్టెంబర్ 30 వరకు వాయిదా వేసింది..

Spread the love