Recent Posts

ఉచిత రేషన్ బియ్యం పంపిణీ వచ్చే సంవత్సరం మార్చి వరకు పొడగింపు

అమరావతి: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటు,దేశంలోని పేదలకు ఉచితంగా అందిస్తున్న 5 కిలోల ఉచిత రేషన్‌ పంపిణీని వచ్చే సంవత్సరం మార్చి వరకు కొనసాగించాలని నిర్ణయించింది..ఈ మేరకు కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు  కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు..కరోనా లాక్‌డౌన్ సమయంలో పేద ప్రజలకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది.ఈ పథకంలో భాగంగా ప్రతి నెల ఒక్కొ వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యం, కిలో గోధుమలను ఉచితంగా అందిచేస్తోంది..కరోనా నెమ్మదించడంతో,ఈ కార్యక్రమాన్ని పొడిగించే ఉద్దేశం తమకు లేదని కేంద్ర ఆహార కార్యదర్శి సుదర్శన్ పాండే వెల్లడించారు.ఈ పథకాన్ని కేంద్రం నిలిపివేస్తుందని ప్రచారం జరిగింది.అయితే ఆర్దికంగా ప్రజలు ఇంకా కొలుకోలేకపోవడంతో,వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.ఉచిత రేషన్ పథకం ద్వారా 80 కోట్ల మంది ప్రజలకు సహయం అందనున్నది..

Spread the love
error: Content is protected !!