Recent Posts

ఇక నుంచి రోజుకు నాలుగు షోలే-అందుబాటు ధరల్లో టిక్కెట్లు-మంత్రి నాని

అమరావతి: పెద్ద బడ్జెట్ సినిమాలు విడుదల సమయంలో నిర్మాతలు వారికి ఇష్టం వచ్చినట్లు టిక్కెట్ రేట్లును పెంచి సొమ్ము చేసుకుంటున్నరని,ఇలా పెంచి అమ్ముకుంటున్న టిక్కెట్లకు సంబంధించి ప్రభుత్వంకు జీస్టీ కూడా చెల్లించడంలేదని,ఇలాంటి ధోరణకు చెక్ పెడుతు సినిమాటోగ్రఫీ చట్టం సవరణలను తీసుకుని వస్తున్నట్లు మంత్రి పేర్ని నాని అన్నారు..బుధవారం అసెంబ్లీలో సవరణ బిల్లును ప్రవేశ పెట్టారు..ఇక నుంచి రోజుకు నాలుగు షోలు మాత్రమే థియేటర్లలో ప్రదర్శించాలని,, పెద్ద, చిన్న సినిమా అనే తేడా లేకుండా అన్నింటికి ఒకే టిక్కెట్ ధర ఉంటుందన్నారు..పెద్ద సినిమాల విడుదల సమయంలో అత్యధిక షోస్ ప్రదర్శిస్తున్నారని, అలానే టిక్కెట్ రేట్లను తమ ఇష్టానుసారంగా పెంచేసి అమ్ముతున్నారని, వీటన్నింటికీ చెక్ పెట్టడం కోసమే ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థను తీసుకురాబోతోందని చెప్పారు.ఈ విధానాన్ని ఏ నిర్మాత విమర్శించడంలేదని,, కేవలం కొన్ని రాజకీయ పార్టీలు,కొన్ని మీడియా సంస్థలు దీనిపై బురద చల్లుతున్నాయన్నారు.మధ్య తరగతి వర్గాలకు ఏకైక వినోదసాధనంగా ఉన్న సినిమాను అందుబాటు ధరకు అందించడమే ప్రభుత్వం కర్తవ్యమని, గతంలో థియేటర్ కౌంటర్ల దగ్గర కొద్ది టిక్కెట్లు అమ్మి, హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టి, ఆ పైన బ్లాక్ లో టిక్కెట్లు అమ్మేవారని, అలాంటి వాటికి ఈ ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంతో చెక్ పెడతామని తెలిపారు..

Spread the love
error: Content is protected !!