Recent Posts

భారత్ కు చేరుకున్న నాలుగు రాఫెల్‌ యుద్ధ విమానాలు

అమరావతి: నాలుగు రాఫెల్‌ యుద్ధ విమానాలు ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరి గురువారం భారత్‌కు చేరుకున్నాయి..వీటిని పశ్చిమ బెంగాల్‌లోని హసీమారా వైమానిక స్థావరంలో మోహరించనున్నారు..ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత వైమానిక దళ చీఫ్​ మార్షల్​ ఆర్​కేఎస్​ భదౌరియా ఫ్రాన్స్​లోని మెరిగ్​నాక్​ వైమానిక స్థావరంను సందర్శించారు.. అనంతరం జెండా ఊపి రాఫెల్ విమానాల ప్రయాణంను ప్రారంభించారు..యుద్ధ విమానాలను సకాలంలో భారత్‌కు పంపించినందుకు ఆయన ఫ్రెంచ్‌ ఏరో స్పేస్‌కు కృతజ్ఞతలు తెలిపారు..యుద్ధ విమానాలు 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశంకు చేరుకున్నాయి..మార్గం మధ్యలో ఫ్రాన్స్,,యు.ఏ.ఇ వైమానిక దళాలు ఈ విమానానికి మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్ అందించినట్లు ఐఎఎఫ్ వెల్లడించింది..ఈ నాలుగు యుద్ధ విమానాల రాకతో రాఫెల్‌ రెండో స్క్వాడ్రన్‌ ఏర్పాటు మరింత వేగవంతం కానుంది..మొదటి స్క్వాడ్రన్‌ను అంబాలా ఏర్‌బేస్‌లో ఏర్పాటు చేశారు..ఒక్కో స్క్వాడ్రన్‌లో 18 యుద్ధ విమానాలు ఉంటాయి..ఇప్పటి వరకు 14 రాఫెల్ యుద్ధ విమానాలు రాగా,,కొత్తగా చేరుకున్ననాలుగు యుద్ధ విమానాలతో ఈ సంఖ్య 18కి చేరింది..ఇంకా 18 యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకోవాల్సి ఉంది..

Spread the love