అమరావతి: హైదరాబాద్ లోని కొండాపూర్ లో నివాసం వుంటున్న ఏపీ మాజీ మంత్రి నారాయణ,అయన సతీమణిని,,ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు..అమరావతి ల్యాండ్ పూలింగ్ కు సంబంధించిన కేసులోనా ? లేక ఏపీలో టెన్త్ పేపర్ లీకేజీలో నారాయణ స్కూల్స్ పాత్ర ఉందా ? అన్న అనుమానంతో సిఐడీ అధికారులు,, నారాయణను అదుపులోకి తీసుకుని రాష్ట్రనికి తరలిస్తున్నారు..విద్యాశాఖ మంత్రి బొత్స.సత్యనారాణ,,సీ.ఎంను కలిసేందుకు వెళ్లుతున్న సమయంలో,మీడియా అడిగిన ప్రశ్నలకు,,సి.ఎంతో సమావేశం అయిన అనంతరం మీడియాతో మాట్లాడుతాను అంటూ వెళ్లిపోయారు..
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ లేక ఇన్నర్ రింగ్ రోడ్డ ఆలైన్ మెంట్ మార్చడంతో,కొంత మందికి లబ్దిచేకుర్చినట్లు అధికారపార్టీకి చెందిన ఎమ్మేల్యే ఫిర్యాదు చేశారు..ఈ విషయంలోనే మాజీ మంత్రి నారాయణను అందుపులోకి తీసుకున్నారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి..
తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచీలో తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. తెలుగు పరీక్ష ప్రారంభమైన తర్వాత ఉదయం 9 గంటల 57 నిమిషాలకు వాట్సాప్ లో క్వశ్చన్ పేపర్ బయటకొచ్చింది..నారాయణ పాఠశాలకు చెందిన గిరిధర్ వాట్సాప్ నుంచి తెలుగు పేపర్ బయటకొచ్చింది. దీంతో నారాయణ స్కూల్స్ కు క్వశ్చన్ లీకేజీతో సంబంధం ఉందనే ఆరోపణలతో నారయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారా..?