Recent Posts

బీజెపీ తమిళనాడు అధ్యక్షడుగా మాజీ IPS అధికారి K.అణ్నామలై

అమరావతి: భారతీయ జనతా పార్టీ పార్టీలో కాని ప్రభుత్వంలో కాని పదవులు ఉన్నత చదువులు చదివిన వారికి ప్రాధన్యం ఇస్తుంది అనేందుకు నిన్న కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఒక ఉదహరణ అయితే,నేడు తమిళనాడు రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడిగా మాజీ IPS అధికారి K.అణ్నామలైకు బాధ్యతలు అప్పగిస్తు బీజెపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం రాత్రి అధికారిక ప్రకటన విడుదల చేయడమే..శుక్రవారం అణ్నామలై బాధ్యలు చేపట్టానున్నారు..పశ్చిమ తమిళనాడులోని కరూర్ జిల్లాలో వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి అణ్నామలై, గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వారు..కోయంబత్తూరులోని ఓ ప్రముఖ కళాశాలలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి IIM లక్నోలో MBA డిగ్రీ చేశారు..అణ్నామలై 2011 కర్ణాటక క్యాడర్‌కు చెందిన IPS అధికారి..ఈయన వయస్సు కేవలం 37 సంవత్సరాలు..అత్యంత పిన్న వయస్సులో తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా నియమితులైన వ్యక్తి అణ్నామలై కావడం విశేషం.. బీజేపీలో చేరి ఏడాది పూర్తికాకముందే ఆయన పార్టీ అధ్యక్ష పదవిని సొంతం చేసుకోవడం విశేషం..తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేస్తూ వచ్చిన ఎల్ మురుగన్ బుధవారంనాటి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నారు..దీంతో ఆయన స్థానంలో కే.అణ్నామలైను పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా నియమిస్తూ బీజేపీ అధిష్టానం చకచకా నిర్ణయం తీసుకుంది..అణ్నామలై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా నియమితులుకావడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది..ఉద్యోగ విధుల రీత్యా అయన గతంలో కర్ణాటకలోని చిక్కమంగళూరు, ఉడిపి జిల్లాలకు SPగా, బెంగళూరు(దక్షిణ) డిప్యూటీ పోలీస్ కమిషనర్‌(DCP)గా పనిచేసిన ఆయన,,2019 సెప్టెంబర్‌లో IPSసేవల నుంచి వైదొలిగారు.. IPS సర్వీస్‌కు వీడ్కోలు పలికిన 11 నెలల అనంతరం 2020 ఆగస్టులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు..ఆటు తరువాత పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు..ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురుచ్చి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు..అన్నాడీఎంకే మద్ధతుతో బరిలో నిలిచిన ఆయన అక్కడ,,కేవలం 24,816 ఓట్ల తేడాతో ఆయన డీఎంకే అభ్యర్థి ఆర్ ఇళంగో చేతిలో ఓటమిచవిచూశారు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన మేర ప్రభావం చూపలేకపోయింది..ఈ విషయాలను దృష్టిలో వుంచుకుని 2024 లోక్‌సభ ఎన్నికలకు అక్కడ పార్టీని సన్నద్ధం చేసే బాధ్యతను పార్టీ అధిష్టనం అప్పగించినట్లు సమాచారం.. యువ నాయకుడికి పార్టీ సారధ్య బాధ్యతలు కట్టబెట్టడం ద్వారా తమిళనాడులో పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ అగ్రనేతలు ఆశిస్తున్నారు..

Spread the love