అమరావతి: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46)రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు..శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో క్విన్స్ లాండ్‌లోని టౌన్స్ విల్లేలో రివర్స్ బ్రిడ్జి ప్రాంతంలో కారు పల్టీలు కొట్టడడంతో,తీవ్ర గాయాలకు లోనైన సైమండ్స్ మృతి చెందినట్లు క్విన్స్ లాండ్ పేర్కొన్నారు.. సైమండ్స్ తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో 1998లో ఆసీస్ జాతీయ జట్టులోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే జట్టులో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు..అనంతరం ఆసీస్ జట్టు గెలిచిన మూడు వరల్డ్ కప్‌లలో భాగస్వామి అయ్యాడు..2012లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కి ముగింపు పలికాడు..ఆస్ట్రేలియా తరఫున తన కెరీర్లో మొత్తం 198 వన్డేలు ఆడిన అండ్రూ 5.088 పరుగులు, 133 వికెట్లు పడగొట్టాడు. అలాగే టెస్టుల్లో 26 మ్యాచులు ఆడి 1,462 రన్స్‌తో పాటు 26 వికెట్లు తీశాడు..టీ20ల్లో 14 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించిన సైమండ్స్ 337 పరుగులు,,8 వికెట్లు తీశాడు.భారత్ లో ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్లకు సైమండ్స్ ఆడాడు.సైమండ్స్ మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, ఆసీస్ మాజీ ఆటగాడు అడమ్ గ్రిల్‌కిస్ట్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, పాక్ బౌలర్ షాయబ్ అక్తర్ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు..
More Stories
G-7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జర్మనీకి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ
అఫ్ఘనిస్తాన్కు భారతదేశం,మానవతా దృక్పథంతోభారీ సహాయం
అప్ఘానిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో భూప్రకంపనలు-రిక్టర్ స్కేలుపై 6.1