Recent Posts

కాబుల్ కు విమానాలు నడపండి, భారతదేశంకు తాలిబన్లు లేఖ

అమరావతి: ఆఫ్ఘనిస్థాన్‌-భారత్ మధ్య వైమానిక సేవలను పునరుద్ధరించాలని ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్(తాలిబన్) భారతదేశంకు ఓ లేఖ రాసింది.కాబూల్‌కు వాణిజ్య విమానాలను పునరుద్ధరించాలని కోరుతూ డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)కు రాసిన లేఖను భారత దేశ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సమీక్షిస్తోంది..ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల స్వాధీనం చేసుకున్న తరువాత కాబూల్‌కు భారత్ విమాన సేవలను నిలిపేసింది..ఇరు దేశాల మధ్య ప్రయాణికుల రాకపోకలు సజావుగా జరగాలనే ఉద్దేశంతో ఈ లేఖను రాస్తున్నట్లు ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ తెలిపింది..ఆప్ఘనిస్తాన్ పౌరవిమానయాన శాఖ తాత్కాలిక మంత్ర అల్హజ్ హమీదుల్లా అఖూంజాదా సంతకంతో లేఖను సెప్టంబరు 7వ తేదిన భారత్ కు పంపినట్లు సమాచారం..ఇందులో ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ క్యారియర్స్ (అరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్, కామ్ ఎయిర్) తమ షెడ్యూల్డు ఫ్లైట్స్‌ను పునరుద్ధరించాలనుకుంటున్నట్లు తెలిపింది.సోదర దేశమైన కతార్ సాంకేతిక సాయంతో కాబుల్ విమానశ్రాయంను పునరుద్దరిచండం జరిగిందని పేర్కొంది. తమ కమర్షియల్ ఫ్లైట్స్‌ పునరుద్ధరణకు అవకాశం కల్పించాలని ఆఫ్ఘనిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ కోరుతోందని లేఖలో తెలిపింది..

Spread the love