Recent Posts

మెన్ క్రికెటర్లకు ధీటుగా వుమెన్ క్రికెటర్ల ఫీల్డింగ్-అద్బుతమైన క్యాచ్

అమరావతి: భారత్‌- ఇంగ్లండ్‌ వుమెన్ T20 మ్యాచ్‌లో అద్భుతం జరిగింది..ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయినా ఫీల్డర్‌ హర్లీన్‌ డియోల్‌ పట్టిన క్యాచ్‌ మ్యాచ్ కే హైలెట్‌ అయ్యింది..బౌండరీ లైన్‌ దగ్గర హర్లిన్‌ పట్టిన ఈ క్యాచ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది..ఇంగ్లండ్‌  యువ క్రికెటర్ అమీజోన్స్ బౌండరీల మీద బౌండరీలు బాదుతూ దూకుడు మీదుంది..ఈ సమయంలో ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో శిఖా పాండే బౌలింగ్‌లో అమీ,భారీ షాట్ ఆడింది..బౌండరీ వద్ద ఆ బంతిని అందుకొనేందుకు హర్లీన్‌ డియోల్‌ అద్భుతమే చేసింది..తల మీదుగా వస్తున్న క్యాచ్‌ను ఎడమవైపు గాల్లోకి డైవ్‌ చేసి అందుకొంది..అయితే బౌండరీ దాటుతున్నానని గ్రహించి బంతిని గాల్లోకి విసిరింది. బౌండరీ అవతలికి వెళ్లి మళ్లీ గాల్లోని బంతిని అందుకొనేందుకు మైదానంలోకి డైవ్‌ చేసింది..ఈ క్యాచ్‌ను అమీ,నమ్మలేకపోయింది..ఈ స్టన్నింగ్ క్యాచ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలోవైరల్‌గా మారింది..క్రికెటర్లు, క్రీడాభిమానులు వారెవ్వా హర్లిన్‌ ను ప్రశంసిస్తున్నారు..

Spread the love