హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం “హరిహర వీరమల్లు” షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ ఏడు ఏకరాలో వేసిన సెట్స్ లో జరుగుతోంది.. సెట్స్ లో చిత్రీకరించే పోరాట సన్నివేశాలకు సంబంధించిన ప్రాక్టీసులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు..ప్రస్తుతం ఆ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణే జరుగుతోంది..తాజాగా ఓ సన్నివేశ చిత్రీకరణ అనంతరం పవన్ కళ్యాణ్ కెమెరాకు ఫిట్ చేసిన మానిటర్ లో సీన్ ను పరిశీలిస్తున్న స్టిల్ ను సోషల్ మీడియాలో క్రిష్ పోస్టు చేశారు..17వ శతాబ్దం నాటి మొఘలాయిలు,, కుతుబ్ షాహీల శకానికి సంబంధించిన కథ కావడంతో నాటి వాతావరణానికి తగ్గట్టుగా పలు సెట్స్ ను తోట తరణి రూపొందిస్తున్నారు..సినిమాకు సంబంధించిన అత్యధిక భాగం షూటింగ్ ఈ సెట్స్ లోనే జూలై నెలాఖరు వరకూ జరిగే ఆవకాశం ఉంది..మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.దయాకరరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయన సోదరుడు,,ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు..కీరవాణి సంగీతం అందిస్తున్నారు..ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది..ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు..
శరవేగంగా హరిహర వీరమల్లు చిత్రీకరణ
