Recent Posts

వరద బాధితులకు 2 వేల రూపాయల నగదు,నిత్యావసరాలు వేగంగా పంపిణీ-జాయింట్ కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన 48,900 కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన తక్షణ సహాయం కింద 2 వేల రూపాయల నగదు, బియ్యం, నిత్యావసర సరుకులను ముమ్మరంగా పంపిణీ చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు.బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్,, నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు జె.సి హరేంధిర ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ జిల్లాలో చేపడుతున్న వరద నివారణ చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు.ముఖ్యంగా వరద బాధిత కుటుంబాలకు నగదు, బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ వేగంగా చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో 92 మెడికల్ క్యాంపులు చేపట్టి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందజేసినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 212 ఇళ్లు వరద ప్రవాహానికి దెబ్బతిన్నాయని, వీటి వివరాలను పూర్తి స్థాయిలో సేకరించి బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరద నష్టం నివారణ చర్యలను వేగంగా,,  బాధితులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో  ఈనెల 27, 28,29 తేదీల్లో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన అన్ని అత్యవసర ఏర్పాట్లను ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love
error: Content is protected !!