Recent Posts

వరికి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి-సీ.ఎం జగన్

అమరావతి: ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన, సాగు చేసేవారికి తగిన తోడ్పాటు అందించడంతో పాటు బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుఅయ్యేలా రైతుల్లో అవగాహన కల్పించాలని సీ.ఎం జగన్ అధికారులను అదేశించారు.సోమవారం వ్యవసాయ అనుబంధ రంగాలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించిన సందర్బలో మాట్లాడుతూ మిల్లెట్స్‌ పండించినా రైతులకు మంచి ఆదాయం వచ్చే విధానాలు ఉండాలని,, వెంటనే ఏర్పాటు మిల్లెట్స్‌ బోర్డును చేయాడంతో పాటు మిల్లెట్స్‌ను అధికంగా సాగుచేస్తున్న ప్రాంతాల్లో ప్రాససింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని సూచించారు..రసాయన ఎరువులు, పురుగుమందులు స్థానే ప్రత్యామ్నాయంగా సేంద్రీయ పద్ధతులద్వారా పంట సాగును ప్రోత్సహించాలన్నారు.. ఆర్బీకే యూనిట్‌గా ఆర్గానిక్‌ వ్యవసాయానికి ప్రాధాన్యత అలాగే ఆర్బీకే పరిధిలో ఏర్పాటుచేస్తున్న సీహెచ్‌సీలో కూడా ఆర్గానిక్‌ వ్యవసాయానికి అవసరమైన పరికరాలను ఉంచాలని సూచించారు..ఆర్బీకేల ద్వారా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ సర్టిఫికేషన్‌కూడా ఇచ్చేలా వ్యవస్థ రావాలన్నారు..ఖరీఫ్‌లో 1.12 కోట్ల  ఎకరాల ఇ–క్రాప్‌ 45,35,102 మంది రైతులు ఇ– క్రాప్‌ చేయించుకున్నారని,,రబీలో ఇ– క్రాప్‌ ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు..

Spread the love
error: Content is protected !!