Recent Posts

నా కోసం ప్రాణాలిస్తాము అనే అభిమానులే-చిరంజీవి

హైదరాబాద్: నా కోసం ప్రాణాలిస్తాన‌ని అనే అభిమానులు,కరోనా కష్టకాలంలో మీరు ధైర్యంగా ముందకు వచ్చి మరేందరో ప్రాణాల్ని కాపాడినందుకు అభినందిస్తున్నానని,రాబోయే రోజుల్లో పేద‌ల‌ను ఆదుకునేందుకు అభిమానుల స‌హ‌కారం కావాల‌ని చిరంజీవి కోరారు.ఆదివారం హైద‌రాబాద్ లోని చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ వేదిక‌గా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ క‌రోనా క్రైసిస్ సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని స్థాపించి అభిమానుల ద్వారా బాధితులకు ఆక్సిజన్ అందచేయడం జరిగిందని,,ఈ సందర్బంగా ఆక్సిజ‌న్ సేవ‌ల్లో పాలుపంచుకున్న ప్ర‌తినిధులను మెగాస్టార్ అభినందించారు..క‌రోనా క‌ష్ట‌కాలంలో నా అభిమానుల్ని కోల్పోయి చాలా ఆవేద‌న చెందానన్నారు..క‌రోనా బారిన ప‌డి దుర‌దృష్ట వ‌శాత్తు.. ప్ర‌సాద్ – హిందూపురం.. ఎర్రా నాగ‌బాబు-అంబాజీపేట. ర‌వి-క‌డ‌ప వీరంద‌రినీ,క‌రోనా పొట్ట‌న పెట్టుకుని విషాదాన్ని మిగిల్చిందని,,వారి ఆత్మ‌కు శాంతి చేకూరాలి ప్రార్ధించారు..ఇక ఈ క‌ష్ట కాలంలో తాను అండ‌గా నిలుస్తాన‌ని నా స్నేహితుడు శేఖ‌ర్ ముందుకొచ్చారని,,విరామ స‌మ‌యాన్ని సేవా కార్య‌క్ర‌మాల‌కు అంకిత‌మిస్తాన‌ని మెగాస్టార్ అన్నారు.శేఖర్ ను చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ బ్యాంక్ ఛీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్ గా నియ‌మించమని, స్వామినాయుడు కూడా అతనితో క‌లిసి ప‌ని చేస్తాడని చెప్పారు..తెలంగాణ,క‌ర్నాట‌క,, ఒరిస్సా నుంచి చిరంజీవి అభిమాన సంఘాల ప్ర‌తినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం అభిమానులంతా మెగాస్టార్ కు అండ‌గా నిలుస్తామ‌ని ప్ర‌మాణం చేశారు.

Spread the love
error: Content is protected !!