Recent Posts

ఫ్యామిలీ మ్యాన్ 2  ట్రైలర్ విడుదల

అమరావతి: వెబ్ సీరీస్ లో ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకున్న“ఫ్యామిలీ మ్యాన్” 2  ట్రైలర్ విడుదల అయింది..సెకండ్ సిరీస్ పై అంచనాలను భారీగా పెంచేసే విధంగా రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″లో మనోజ్ బాజ్‌పేయి,, ప్రియమణిలతో పాటు సమంత ప్రధాన పాత్రల్లో నటించారు..ఈ సిరీస్‌తో సమంత రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది..సమంత ఇందులో ఆత్మహత్య దళ సభ్యురాలిగా నటిస్తున్నారు.. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి “ఫ్యామిలీ మ్యాన్-2 ఎగైనెస్ట్ తమిళ్” అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో వుంది..తమిళుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంకి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు.. శ్రీలంకలో తమిళ వాసుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం సంస్థ అసలు టెర్రరిస్ట్ సంస్థ కాదని,, తమిళ నటి అయిన సమంత ఇలాంటి పాత్రలో నటించడం ఏంటంటూ తమిళలు మండిపడ్డుతున్నారు..ట్రైలర్ పై చిన్నపాటి వివాదం చేలరేగడంతో,,ఈ సీరీస్ కు మరింత హైప్ వస్తుంది..

Spread the love