AMARAVATHIPOLITICS

ఎగ్జిట్ పోల్స్-ఎగ్జాట్ పోల్ అవుతాయా?

2014 ఎగ్జిట్ పోల్స్?

అమరావతి: 2014లో BJP నేతృత్వంలోని NDA విజయం సాధిస్తుందని,, NDAఎన్డీయే అధికారంలోకి వస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి..గెలుపు శాతం ఏ మేర వుంటుంది అనే విషయాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాయి..NDA సాధించిన భారీ ఆధిక్యతను వారు గుర్తించలేకపోయారు..2014లో ఎనిమిది ఎగ్జిట్ పోల్స్ సగటున NDAకు 283 సీట్లు,, UPAకు 105 సీట్లు వస్తాయని అంచనా వేశాయి..అయితే సదరు ఎన్నికల్లో NDA కూటమికి 336, UPAకు 60 సీట్లు వచ్చాయి.. ఆ ఎన్నికల్లో BJPకి సోంతంగా 282,,CONGకు 44 సీట్లు వచ్చాయి.

2019 లో ఎగ్జిట్ పోల్స్?

ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారు అయిన సందర్బాలు చాలా ఉన్నాయి..సదరు సంస్థల విశ్వసనీయతపై కూడా చాలా ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి..ఎగ్జిట్ పోల్స్ లో అంచనాలు తప్పె అవకాశం ఉండడంతో సాధారణంగా ఎర్రర్ మార్జిన్ తో ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటిస్తాయి..2019లో సగటున NDAకు 306, UPAకు 120 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి..అయితే వారి అంచనాకు మించిన స్థాయిలో NDA అత్యధిక స్థానాల్లో గెలుపొందింది..2019 ఎన్నికల్లో NDAకు 353 సీట్లు,,BJPకి 303 సీట్లు రావడంతో 2019 లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి.. 2019 లోక్ సభ ఎన్నికల్లో UPAకు 93,CONGకు 52 సీట్లు వచ్చాయి..

2024  లోక్ సభ ఎన్నికలు NDA,,UPAల మధ్య కాకుండా,, NDAకు, కొత్తగా ఏర్పడిన విపక్ష కూటమి ‘I.N.D.I.A’ కు మధ్య జరిగాయి..ఈ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ NDA గెలిచే స్థానాల సంఖ్య 400 లు దాటాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు..ఇదే సమయంలో BJP సొంతంగా 370 సీట్లను గెలుచుకుంటుందని ఆంచన వేశారు..తొలుత న్యూస్ చానళ్లలో జరిగే ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనబోమని  ప్రకటించిన CONG,,తరువాత తన నిర్ణయం మార్చుకుని,,చర్చల్లో పాల్గొన్నాలని నిర్ణయించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *