Recent Posts

అమెరికాకు వెళ్లె వారిలో కొన్ని వర్గాల వారీకి మినహయింపు

అమరావతి: భారత్‌ నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు,,విద్యావేత్తలు,,జర్నలిస్టులు,,ఒక్కరిగా వచ్చే వ్యక్తులకు మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది..భారత్ నుంచి అమెరికా వచ్చే ప్రయాణికులపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కొత్త ఆంక్షలను విధించారు.. ఇండియాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు..భారత్‌లో 14 రోజుల ఉన్నవాళ్లకు అమెరికాలోకి ప్రవేశం లేదని తెలిపిన అధ్యక్షుడు,,పైన పేర్కొన్న మినహయింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు..యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ నిబంధనల ప్రకారం బ్రెజిల్,,చైనా,,ఇరాన్,,దక్షిణాఫ్రికా నుంచి కొన్ని వర్గాల ప్రయాణికులకు అమెరికన్ ప్రభుత్వం మినహాయింపులను ఇచ్చింది..అవే మినహాయింపులను భారత్‌కు కూడా ఇస్తున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి టోని బ్లింకెన్ పేర్కొన్నారు..ఆగష్టులో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నందున విద్యార్థులు 30 రోజుల ముందుగానే అమెరికాకు రావొచ్చని ఆయన తెలిపారు..ప్రపంచవ్యాప్తంగా  నమోదవుతున్న కరోనా కేసుల్లో మూడింట ఒక వంతు కేసులు ఇండియాలోనే నమోదవుతున్నట్లు అమెరికా పేర్కొంది.. 

Spread the love