Recent Posts

రాష్ట్రంలో జీనోమ్ సీక్వెన్సింగ్ కేంద్రం ఏర్పాటు

అమరావతి: దేశంలో కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్ననేపథ్యంలో ఈ వైరస్‌ను గుర్తించడానికి సాంకేతిక పరికరాలతో కూడిన ల్యాబ్ అవసరం కాగా ఇప్పటివరకు ఇలాంటి విధానం కలిగి ఉన్న ల్యాబ్‌లు దేశంలో పుణె, హైదరాబాద్ నగరాల్లోనే ఉన్నాయి..తాజాగా విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో జీనోమ్ సీక్వెన్సింగ్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది..హైదరాబాద్‌లోని సీసీఎంబీ ఆధ్వర్యంలో విజయవాడ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లో అధికారులు పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల శాంపిల్స్‌లో కొన్నింటిని ర్యాండమ్ పద్ధతిలో ఇక్కడి ల్యాబ్‌లో పరీక్షించి,,ఏ రకానికి చెందిన మ్యుటెంట్‌లో శాస్త్రవేత్తలు తెలియచేస్తారు..ప్రస్తుతం ఏపీ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీకి తరలిస్తున్నారు.ఇక నుంచి ఒమిక్రాన్ లాంటి మ్యుటెంట్‌లను గుర్తించడానికి హైదరాబాద్, పుణె లాంటి నగరాలపై ఆంధ్రప్రదేశ్ ఆధారపడాల్సిన అవసరం ఉండదు..

Spread the love
error: Content is protected !!