Recent Posts

దేశంలోని ప్ర‌తి జిల్లాలో ఒక మెడిక‌ల్ కాలేజీ లేదా పీజీ వైద్య విద్యాకేంద్రం ఏర్పాటు-ప్రధాని మోదీ

అమరావతి కరోనా వైరస్ విజృంభణతో దేశంలో వైద్యవ్యవస్థ పలు సమస్యలను ఎదుర్కొంది..ఈ లాంటి స‌మ‌యంలో నేర్చుకున్న పాఠాల‌ను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య‌రంగాన్ని బ‌లోపేతం చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుందని,,ఆరోగ్య రంగాన్ని బ‌లోపేతం చేయ‌డంతో పాటుగా స్వ‌యం స‌మృద్ది సాధించేందుకు కృషి చేస్తున్నామ‌ని ప్ర‌ధాని మోడి పేర్కొన్నారు..ఇందులో భాగంగానే దేశంలోని ప్ర‌తి జిల్లాలో ఒక మెడిక‌ల్ కాలేజీ లేదా పీజీ వైద్య విద్యాకేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు ప్ర‌ధాని మోడి తెలిపారు..గురువారం రాజ‌స్థాన్‌లోని నాలుగు జిల్లాల్లో మెడిక‌ల్ కాలేజీల‌కు ప్ర‌ధాని శంకుస్థాప‌న చేశారు..2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌స్థాన్‌లో మొత్తం 23 మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింద‌ని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు. 2014 వ‌ర‌కు దేశ వ్యాప్తంగా మెడిక‌ల్ పీజీ కాలేజీల్లో 80 వేల సీట్లు ఉండ‌గా, ప్రస్తుతం ఆ సంఖ్య 1.40 ల‌క్ష‌ల‌కు చేరింద‌ని చెప్పారు.. దేశంలోని 6 ఏయిమ్స్ నుంచి 22 ఏయిమ్స్ వ‌ర‌కు పెరుగుతున్నాయ‌ని,,అలాగే గ‌డిచిన 6-7 సంవత్సరాల్లో దేశంలో కొత్త‌గా 170 మెడిక‌ల్ కాలేజీలను ఏర్పాటు చేసిన‌ట్టు ప్ర‌ధాని పేర్కొన్నారు.. 

Spread the love