Recent Posts

బయటపడుతున్న జికా వైరస్ కేసులు-ఆప్రమత్తత అవసరం

అమరావతి: 1947లో ఉగాండాలోని ఓ అడవిలో బయటపడిన జికా వైరస్,గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలను భయపెడుతునే వుంది..గతంలో ఈ వైరస్ గురించి ప్రజల్లో పెద్దగా అందోళను వుండేవి కావు..అయితే 2020 నుంచి కరోనా వైరస్ విలయతాండవం చూసిన ప్రజల్లో, ప్రస్తుతం జికా వైరస్ సోకుతుందేమోని భయం మొదలైంది..దినికి తోడు కేరళలో జికా వైరస్ కేసులు బయటపడట ఆందోళన కలిగిస్తోంది..తిరువనంతపురం జిల్లాలో 13 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి..పూణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్‌కు 19 మంది శాంపిళ్లను పంపించగా ఇందులో 12 మందికి జికా వైరస్ సోకినట్లు తేలింది..జికా వైరస్ సోకితే ఫీవర్, దద్దుర్లు, కండ్ల కలకలు, కీళ్ల నొప్పులు, తల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు పేర్కొంటున్నారు..జికా వైరస్ ఏడెస్ దోమ వల్ల మనుషులకు వ్యాప్తి చెందుతోంది..ఏడెస్ దోమలు నిల్వ ఉన్న నీటిలో సంతానోత్పత్తిని చేస్తాయి..జికా వైరస్ రోగనిరోధక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుంది.. ఈ వైరస్ బారినపడిన వారిలో కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలను కనిపించకపోవచ్చు..జికా వైరస్ సోకితే,గర్భవతులకు చాలా ప్రమాదం..కడుపులో పెరుగుతున్న బిడ్డపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు తెలిపారు..ఈ వైరస్‌ నియంత్రణకు ఇప్పటి వరకు ఎటువంటి టీకాలు కాని, మందులు కాని అందుబాటులోకి రాలేదు..ఇంటిలోపల,,పరిసర ప్రాంతాల్లో మురుగు నీరు చేరకుండాజాగ్రత్తలు తీసుకోవడమే మన ముందు వున్న కర్తవ్యం..

Spread the love