Recent Posts

దేశ వ్యాప్తంగా నేషనల్ హైవేలపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్-రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్

అమరావతి: దేశంలో 20 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ ను జాతీయ రహదారులపై నిర్మించడం జరుగుతోందని,ప్రకృత్తి విపత్తు సమయంలో,రెస్క్యూ ఆపరేషన్ కోసం వాడనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. దేశ ఐక్యత సమగ్రతను కాపాడుకొనేందుకు ఇదో మార్గమని వెల్లడిస్తూనే…ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కొనే సామర్థ్యం భారతదేశం కలిగి ఉందని మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.గురువారం రాజస్తాన్ లోని జాలోర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఉపరితలశాఖ శాఖ మంత్రి నితిన్ గడ్కరి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కే ఎస్ బదౌరియా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ మాట్లాడుతూ నేషనల్ హైవేలపై అనేక చోట్ల హెలిప్యాడ్ లను నిర్మించడం జరుగుతోందని, ఆర్మీ సామర్థ్యం పెంచేందుకు నేషనల్ హైవే అథార్టీ ఆఫ్ ఇండియా దేశంలోని,అనేక ప్రాంతాల్లో వీటిని అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు.జాలార్ లో ఉన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డింగ్ వద్ద మూడు హెలిప్యాడ్లను కూడా నిర్మించడం జరిగిందన్నారు..తొలుత సుఖోయ్ SU-30 MKI ఫైటర్ విమానాన్నిజాతీయ హైవేపై ల్యాండ్ చేశారు.. ఒక ఫైటర్ యుద్ధ విమానం హైవేపై ల్యాండ్ కావడం చరిత్రలో ఇదే తొలిసారి.వైమానిక దళానికి చెందిన C-130 J సూపర్ హెర్య్కులస్ రవాణా విమానాన్ని కూడా ల్యాండ్ చేశారు.ఈ విమానంలో మంత్రి రాజ్ నాథ్, గడ్కరి, ఎయిర్ చీఫ్ లు ప్రయాణించారు..

Spread the love
error: Content is protected !!