Recent Posts

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం విడుదల చేశారు..రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం 1,75,8687 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా,పరీక్షకు 1,66,420 మంది విద్యార్థులు హాజరయ్యారని,వారిలో 80.62 శాతంతో 1,34,205 మంది విద్యార్థులు అర్హత సాధించారని వెల్లడించారు.. విద్యార్థుల రెస్పాన్స్ షీట్ లను ఈ నెల 26 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తామని,గురువారం నుంచి వెబ్‌సైట్‌లో ర్యాంక్‌ కార్డులను అందుబాటులో ఉంచుతామన్నారు..ఈనెల 18వ తేదీ నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానున్నట్టు తెలిపారు..ఇప్పటికే ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు ఈనెల 3వ తేది నుంచి ఐదు విడతలుగా నిర్వహించిన పరీక్షలు నిన్నటితో ముగిశాయి. ఈ పరీక్షలకు 83,822మంది దరఖాస్తు చేయగా, 78,066మంది హాజరైనట్టు తెలిపారు..

ఏపీ ఈఏపీసెట్ లో ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మాకు మొత్తంగా 2,59,688 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని,ఈ నెల 14 అగ్రి, ఫార్మా ప్రవేశ పరీక్షల ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు..గత రెండేళ్లతో పోల్చుకుంటే అర్హులైన విద్యార్థుల శాతం తగ్గిపోయిందని,దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య మాత్రం పెరిగినట్టు వెల్లడించారు.. పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు, సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు.నేడు ప్రకటించిన ఫలితాల్లో ఈసారి అమ్మాయిలు మొదటి పది ర్యాంకుల్లో కనీసం ఒక్ ర్యాంకు కూడా సాధించలేకపోయారు..మొదటి ర్యాంక్ అనంతపురం జిల్లాకు చెందిన కోయి శ్రీ నిఖిల్,, సెకండ్ ర్యాంక్ వరద మహంత్ నాయుడు, రాజాం, శ్రీకాకుళం జిల్లా, వెంకట హనీష్(కడప), దివాకర్‌ సాయి(విజయనగరం)లకు థర్డ్‌ ర్యాంక్‌లలో నిలిచారు..

Spread the love