July 4, 2022

ఎనిమిది సంవత్సరాల పాలనలో ప్రజలు సిగ్గుపడేలా ఏలాంటి పని చేయలేదు-ప్రధాని మోదీ

అమరావతి: గత ఎనిమిది సంవత్సరాల ఎన్డీయే పరిపాలనలో గుజరాత్ కే చెందిన మహాత్మగాంధీ, సర్దార్ పటేల్ కలల్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాని,,గుజరాత్ ప్రజలు సిగ్గుపడేలా ఏలాంటి పని చేయలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.. గుజరాత్ లోని రాజ్ కోట్ లోని అత్‌కోట్‌లో శనివారం కొత్తగా నిర్మించిన మాతుశ్రీ కేడీపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు..అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని… పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలు సాధికారత సాధించాలని బాపూజీ కోరుకున్నారని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు..గతంలో గుజరాత్ రాష్ట్రంలో తొమ్మిది మెడికల్ కాలేజీల్లో 1100 సీట్లు మాత్రమే ఉండేవని,,ప్రస్తుతం పరిస్థితి మారిందని,,నేడు మొత్తం 30 ప్రైవేట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని,,ఆర్థికంగా బలహీనంగా ఉన్న తల్లిదండ్రులు సైతం తమ పిల్లలు డాక్టర్లు కావాలని కోరుకుంటారని అన్నారు.. అయితే అడ్మిషన్ సమయంలో వారు మొదట అడిగేది మీకు ఇంగ్లీష్ తెలుసా అని,,ఇది అన్యాయమన్నారు..తాము నిబంధనలను మార్చామమని,,ఇప్పుడు గుజరాతీ విద్యా నేపథ్యం ఉన్న విద్యార్థులు కూడా ఇంజనీరింగ్, మెడికల్ పూర్తి చేయగలరని మోడీ తెలిపారు..గత యూపీఏ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు..తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రంలోని యూపీఏ నాయకులు ఫైళ్లను క్లియర్ చేయలేదని గుర్తుచేశారు..వారసత్వ రాజకీయాల్ని తాను ఎన్నడూ ప్రోత్సహించలేదన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాల లాగానే భారతదేశం కూడా కోవిడ్-19తో పోరాడుతున్నందున,, వ్యాక్సిన్ ప్రజలకు చేరువయ్యేలా ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు..మహిళలకు గౌరవప్రదమైన జీవితం కోసం జన్ ధన్ యోజన పథకం ప్రజలకు ఉపయోగపడిందని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు..రైతులు, కార్మికుల జన్ ధన్ ఖాతాల్లో నేరుగా నగదు డిపాజిట్ చేసామని,,కరోనా, యద్ధ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్నామని, ఎక్కడా రాజీ పడలేదని గుర్తు చేశారు..పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేయడంతోపాటు,, ప్రజలు అందరికీ ఉచిత టీకాలు అందించామన్నారు..ప్రభుత్వ ప్రయత్నాలకు,, ప్రజల చేయుత ఇచ్చినప్పడే సేవ చేసే బలం పెరుగుతుందన్నారు.. ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా గుజరాత్ లో పర్యటిస్తున్నారు..

Share
error: Content is protected !!