Recent Posts

30 నుంచి 40 నిమిషాల్లో దుర్గమ్మ దర్శనం కలుగుతుంది-మంత్రి వెల్లంపల్లి

అమరావతి: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు శనివారం ఇంద్రకీలాద్రిపై జగన్మాతగా శ్రీ గాయత్రీదేవి అవతారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మని దర్శించుకుంటున్నట్లు రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ మంత్రి వెల్లంపల్లి.శ్రీనివాసరావు తెలిపారు.శనివారం ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ ఎటువంటి శుభకార్యమైన లోకమాత గాయత్రిదేవి ఉపాసనతోనే ప్రారంభిస్తారన్నారు.శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి అసౌఃరనకచం కలుగకుండా అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నమన్నారు.సామన్య భక్తులకు కూడా 30 నుంచి 40 నిమిషాల్లో అమ్మవారి దర్శనం కలుగుతుందన్నారు.కోవిడ్ నిబంధనల కారణంగా రోజుకు 10 వేల మంది భక్తులను అనుమతించాలని అనుకున్నమన్నారు..అయితే అన్ లైన్ లో టిక్కట్లు తీసుకోలేక నేరుగా దర్శనంకు వచ్చిన వారికి కూడా దుర్గమ్మ దర్శనం సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నమన్నారు.అదివారం,సోమవారం మూలా నక్షత్రం రోజుల్లో వచ్చే వక్తుల రద్దిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.అన్నప్రసాద వితరణ సక్రమంగా జరుగుతుందన్నారు.ఈ దసరా ఉత్సవాలు రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలిగిస్తుందని మంత్రి అకాంక్షించారు..

Spread the love