హైదరాబాద్: అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ ఆశీష్ జైన్ ను హైదరాబాద్,దొమల్ గూడా,స్ట్రీట్ నెం-1లో నివాసం వుంటున్నఅతన్ని,నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో DIG ఆరవింద్ ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు.. ఆదివారం అతని ఇంట్లో నుంచి రూ.3 కోట్ల 71 లక్షల నగదు,ల్యాప్ టాప్స్,మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు..ఆశీష్ జైన్ దోమలగూడలో ఇన్ఫినిటీ ఇంటర్ నెట్ ఫార్మసీ నడుపుతున్నాడు..సైకోట్రోఫిక్ మందుల పేరుతో భారత్ నుంచి అమెరికాతో పాటు విదేశాలకు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు NCB అధికారులు గుర్తించారు..వెయ్యికి పైగా ట్రాన్సాక్షన్స్, వాయిస్ ఓవర్ ప్రొటోకాల్ (VOP) ద్వారా జరిగినట్లు ఆధారలు అధికారులు సేకరించినట్లు NCB అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు..
అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ ఆశీష్ జైన్ అరెస్ట్
