Recent Posts

దీపావళీకు భారత్ నుంచి ఆర్డర్లు లేకపోవడంతో రూ.50 వేల కోట్లు నష్టపోతున్న డ్రాగన్

పుంజుకుంటున్న దేశీయ మార్కెట్లు..

అమరావతి: భారతదేశ సరిహద్దుల వద్ద కుట్రలను పన్నుతున్న చైనాకు,భారత వ్యాపారులు కొట్టిన దెబ్బకు చైనాకు దిమ్మెతిరిగింది..దీపావళి సీజన్‌లో చైనా వస్తువులను భారత వ్యాపారులు నిషేదించడంతో డ్రాగన్ దేశపు ఎగుమతిదారులు కొన్ని వేల కోట్లు నష్టపోనున్నారు.ఈ దీపావళికి చైనా సరకులను బాయ్ కాట్ చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) వ్యాపారులకు పిలుపునిచ్చింది.దీంతో చైనాకు సుమారు రూ. 50 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు CAIT తెలిపింది..దేశంలోని ప్రధాన నగరాల్లోని వినియోగదారులు చైనీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని,,దింతో భారతీయ వస్తువులకు డిమాండ్‌ను పెరుగుతున్నట్లు CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు.ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ  ఇటీవల 20 ముఖ్యమైన నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఇప్పటివరకు దీపావళి వస్తువులు, బాణసంచా లేదా ఇతర వస్తువుల కోసం చైనా ఎగుమతిదారులకు భారతీయ వ్యాపారులు లేదా దిగుమతిదారులు ఎటువంటి ఆర్డర్‌లు ఇవ్వలేదని తేలిందన్నారు.ప్రస్తుత పరిణామంతో భారతీయ వినియోగదారుల నేరుగా దేశీయ వస్తువుల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోందని,,దీని ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో  రూ.2 లక్షల కోట్ల మేర లావాదేవీలు జరగబోతున్నట్లు తెలిపారు.గత సంవత్సరం లాగానే, ఈ సంవత్సరం కూడా CAIT చైనీస్ వస్తువులను బహిష్కరణకు పిలుపునిచ్చిందన్నారు..

Spread the love
error: Content is protected !!