DISTRICTSEDU&JOBSOTHERS

సిటీలోని 54 ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్స్ గా తయారు చేస్తాం-మంత్రి నారాయణ

నెల్లూరు: దేశంలోని అత్యుత్తమ విద్యా ప్రమాణాలు గల పాఠశాలగా VRHSని తయారు చేస్తున్నామని, ఇది నిరుపేద బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే సరస్వతీ విద్యాలయంగా మారనుందని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు..శుక్రవారం వీఆర్ పాఠశాల ఆధునీకరణ పనులను ఇంచార్జ్ కలెక్టర్ కార్తీక్, మున్సిపల్ కమిషనర్ నందన్ తో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. భవిష్యత్ తరాల విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలని సంకల్పంతో రూ.15 కోట్ల వ్యయంతో సిద్దమౌతున్న సరస్వతీ నిలయాన్ని మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు.ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసే స్పోర్ట్స్ కోర్ట్ డిజైన్ ను పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ విఆర్సీకి పూర్వ వైభవం తెస్తానని ఇచ్చిన మాట ప్రకారం అన్ని పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. నిరుపేద పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా స్కూల్ ను తీర్చిదిద్దుతున్నామన్నారు. ఏడాదికి 1000 మంది చొప్పున ఐదేళ్లలో ఐదువేలమంది పేదపిల్లలకి అడ్మిషన్ కల్పిస్తామని తెలిపారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీని MSMEగా మార్చి 25 వేల మందికి ఉపాధి కల్పించబోతున్నామని వెల్లడించారు.విఆర్సీలో చదివే విద్యార్థుల్లో కొన్ని కుటుంబాలను నా కుమార్తెలు, అల్లుళ్ళు దత్తత తీసుకొంటున్నారని వెల్లడించారు.P4 కింద మరికొందరిని దత్తతకు ఆహ్వానిస్తామన్నారు. వి ఆర్ సి తరహాలోని సంతపేటలోని ఆదర్శ పాఠశాలను కూడా DSRకంపెనీ అధినేత సుధాకర్ రెడ్డి దత్తత తీసుకోవడం సంతోషదాయకమన్నారు. వీఆర్సీ కి ధీటుగా గుంటబడిని తయారు చేస్తామని మంత్రి వెల్లడించారు. నెల్లూరు సిటీలో ఉన్న54 ప్రభుత్వ పాఠశాలలను కూడా మోడల్ స్కూల్స్ గా తయారు చేస్తామని తెలియజేశారు. తద్వారా రానున్న కాలంలో విద్యాప్రమాణాలు మరింత మెరుగు పరుస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, డిఇఓ బాలాజీ రావు, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *