దగదర్తి ఎయిర్పోర్ట్ ఏర్పాటు పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం-ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు: ✈ దగదర్తి విమానాశ్రయం ఏర్పాటుకు అనువైన పరిస్థితులను అంచన వేసేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు అదేశాలనతో, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా బృందాన్ని పరిశీలనకు రావడం శుభపరిణామం అని నెల్లూరు ఎం.పీ వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి అన్నారు.. శుక్రవారం దగదర్తి విమానాశ్రయం ఏర్పాటు ప్రాంతాన్ని భారత ప్రభుత్వ విమానయాన సంస్థ DGM మల్లికా జయరాజ్,,DGM పరవేంధర్ తివారి, సీజేంద్ర కుమార్ రెడ్డి,, సుజీన్ రాజు పరిశీలించారు..ఈ పర్యటనలో ఎంపీలు వేమిరెడ్డి,,మస్తాన్ రావు, ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా ఎం.పీ వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో మనం భాగస్వామిగా వుండడంతో అనేక పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి పనులు మొదలవుతున్నాయని చెప్పారు..2019లో దగదర్తి విమానాశ్రయం ఏర్పాటుకు సీ.ఎం చంద్రబాబు భూమిపూజ చేశారని, గత ప్రభుత్వం పూర్తిగా విమానాశ్రయాన్ని నిర్లక్ష్యం చేయడంతో పనులు నిలిచిపోయాయన్నారు..DPRలు తయారుచేసి 96 కోట్ల నిధుల విడుదలకు సీ.ఎం ఆదేశాలిచ్చినట్లు చెప్పారు..ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.